NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

దేవీ
బుధవారం, 11 జూన్ 2025 (19:06 IST)
NTR, Hrithik Roshan
అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా వార్ 2 డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
 
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ  ‘వార్ 2’  YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అడ్రినలిన్-పంపింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోన్నారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments