Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత పబ్లిసిటీ కోసమే డ్రగ్స్ కేసులో ఇరికించారు : నటి మమతా కులకర్ణి

తనను డ్రగ్స్ కేసులో ఇరికిస్తే ఉచితంగానే మంచి ప్రచారం లభిస్తుందని పోలీసులు భావించారని, అందువల్లే డ్రగ్స్ కేసులో తన పేరును చేర్చారని బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సంచలన ఆరోపణలు చేశారు.

Webdunia
గురువారం, 28 జులై 2016 (12:43 IST)
తనను డ్రగ్స్ కేసులో ఇరికిస్తే ఉచితంగానే మంచి ప్రచారం లభిస్తుందని పోలీసులు భావించారని, అందువల్లే డ్రగ్స్ కేసులో తన పేరును చేర్చారని బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త విక్కీ పోలీసులకు చిక్కిన తర్వాత, కేసులో తనను ఇరికిస్తే ఉచితంగా పబ్లిసిటీ వస్తుందన్న కారణంతోనే తన పేరు చెప్పారని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మమతా బెనర్జీ భర్త విక్కీని పోలీసులు అరెస్టు చేసిన విషయంతెల్సిందే. 
 
ఈనేపథ్యంలో ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న మమతా కులకర్ణి ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. "నేను బాలీవుడ్‌ను వీడినప్పుడు నంబర్ 2 స్థానంలో ఉన్నాను. విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆయన జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చినా కలుసుకోలేదు. నా మానాన నేను అద్దె ఇంట్లోనే నివశిస్తూ వచ్చాను. కానీ, పోలీసులే నన్ను ఇరికించారు. వారికి వచ్చిన ఇగోనే ఇందుకు కారణం" అని అంటోంది. 
 
తనపై ఆరోపణలు వచ్చిన డ్రగ్స్ కుంభకోణం రూ.2 వేల కోట్లదని పోలీసులు వెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అంత డబ్బే ఉంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉంటామని ప్రశ్నించింది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.25 లక్షలపై వస్తున్న వడ్డీపైనే బతుకుతున్నానని ఆమె వాపోయింది. కాగా, 1990వ దశకంలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె... ఆపై డ్రగ్స్ రాకెట్‌లో ఇరుక్కుని బాలీవుడ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments