Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ నటుడు సిజు విల్సన్ చిత్రం పులిగా రాబోతుంది

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (18:34 IST)
Siju Wilson first look
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్  కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా 'అమ్మదొంగ' లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు.
 
ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 'పులి' అనే  టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'The 19th century' అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో కదనరంగంలో ఖడ్గవీరుడిగా కనిపించారు సిజు విల్సన్.
 
తెలుగు రైట్స్ దక్కించున్న నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. మంచి కథ, కథనంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని తెలియజేస్తాం''అన్నారు.
 
ఎస్.కె రామచంద్రనాయక్ సహా నిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments