Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాళవిక నాయర్ మేజరయ్యిందోచ్.. మార్చికి తర్వాతే సినిమాలకు ఒప్పుకుంటా!

Webdunia
మంగళవారం, 5 జనవరి 2016 (11:56 IST)
ఎవడే సుబ్రమణ్యం? సినిమాతో తెరంగేట్రం చేసిన మాళవిక నాయర్.. నటనలో సీనియర్ కానీ ఆమె వయస్సు పరంగా చాలా జూనియర్. మెచ్యూరిటీ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్లస్ టూ చదువుతోంది. ఇంకా సోమవారమే మేజరయ్యింది.

సోమవారం ఆమె తన 18వ పుట్టినరోజు వేడుకని కళ్యాణ వైభోగమే టీమ్‌తో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా కొత్త నిర్ణయాల్ని ప్రకటించింది. తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుందని ఇకనుంచి ఇక్కడే కంటిన్యూ అవుతానని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికప్పుడు ఏ సినిమా ఒప్పుకోననీ మార్చిలో పరీక్షలు పూర్తి చేశాకే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానని వెల్లడించింది. 
 
ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్ క్యారెక్టర్లు ఎలా చేస్తున్నావని అడిగితే... "నా మనసుకు ఒక పాత్ర దగ్గరైందంటే చాలు.. అందులో ఇట్టే ఒదిగిపోతా. పైగా చిన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నా. పలు సినిమాల్లో అక్కగా చెల్లిగా నటించిన అనుభవం ఉంది. అందుకే పాత్రల్ని తొందరగా ఆకళింపు చేసుకొంటుంటా`` అని చెప్పుకొచ్చింది మాళవిక. సొంత రాష్ట్రం కేరళనే అయినా... తన కుటుంబం మాత్రం ఢిల్లీలోనే ఉంటుందట. సైన్స్, ఆర్ట్స్, పెయింటింగ్స్ అంటే తనకు  చాలా ఇష్టమని వెల్లడించింది.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments