Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ అంత అసహ్యకరమైంది మరొకటి లేదంటున్న బాలీవుడ్ భామ

మేకప్ లేనిదే ఏ ప్రోగ్రాముకూ రాని హీరోయిన్లు, నటీమణులూ ఉంటున్న బాలీవుడ్‌లో మేకప్ అంటేనే అసహ్యం అని ఒక హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తోందీ భామ. ఎవరో కాదు ఆషికీ-2తో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన శ్రద్దా కపూర్. మోహిత్‌ సూరి దర్శకత్వంలో ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’

Webdunia
శనివారం, 13 మే 2017 (05:22 IST)
మేకప్ లేనిదే ఏ ప్రోగ్రాముకూ రాని హీరోయిన్లు, నటీమణులూ ఉంటున్న బాలీవుడ్‌లో మేకప్ అంటేనే అసహ్యం అని ఒక హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తోందీ భామ. ఎవరో కాదు ఆషికీ-2తో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన శ్రద్దా కపూర్. మోహిత్‌ సూరి దర్శకత్వంలో ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’లో నటిస్తున్న శ్రద్ధాకపూర్‌ మేకప్ జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం అంటోంది.
 
‘‘మేకప్‌ వేసుకొని చక్కగా హెయిర్‌ స్టైల్‌ చేసుకోవాలంటే నాకు చాలా అసహనం. సాదాసీదాగా బయటికి వెళ్లడంలోనే సంతోషం ఉంటుంది వ్యక్తిగత జీవితంలో నేను మగరాయుడిలా ఉంటాను. ‘హాఫ్‌..’లో నేను పోషిస్తున్న రియా పాత్ర కొంచెం నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ అలా ఉండదు. రియా పాత్రలో ట్రాక్‌ ఫ్యాంట్లు, స్లిప్పర్స్‌తోనే కనిపిస్తాను. దిల్లీలో ఉండే ధనికుల కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర అది. బాడీ లాంగ్వేజి కోసం సూరి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పాత్ర చాలా ఛాలెంజింగ్‌ అనిపించింది’’  అంటూ తన అంతరంగాన్ని విప్పి చెప్పింది శ్రద్ధా. 
 
చిన్న చిన్న విషయాలే తనకు ఎక్కువ ఆనందం ఇస్తాయంటోంది శ్రద్ధ. ‘‘వర్షంలో తడవడం చిన్న విషయమే కానీ తొలకరి జల్లుల్లో తడిస్తే మాటల్లో చెప్పలేని ఆనందం దక్కుతుంది. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చేయడం మరీ ఇష్టమ’’ని చెప్పింది 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments