Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీ‌కారం' టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌న్న మ‌హేశ్‌బాబు

"తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (20:11 IST)
Sarvanand, Srikaram teaser
శ‌ర్వానంద్ న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'శ్రీ‌కారం'‌. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ ('నానీస్ గ్యాంగ్ లీడ‌ర్' ఫేమ్‌) న‌టిస్తున్నారు. 14  రీల్స్ ప్ల‌స్‌  బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న 'శ్రీ‌కారం'ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు 'శ్రీ‌కారం'కు త‌న స‌పోర్ట్ అందించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 4:05 గంట‌ల‌కు 'శ్రీ‌కారం' టీజ‌ర్‌ను ఆయ‌న లాంచ్ చేశారు. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ, సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌నీ మ‌హేష్ బాబు ఆకాంక్షించారు. మొత్తం టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
సినిమా కంటెంట్ ఏమిటి, శ్రీ‌కారం క‌థ ప్ర‌యోజ‌న‌మేమిటి? అనే విష‌యాల‌ను ఈ టీజ‌ర్ స్ప‌ష్టంగా తెలియ‌జేస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. హీరో శ‌ర్వానంద్ చెప్పిన‌ రెండు డైలాగ్స్ ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్‌ను వెల్ల‌డిస్తున్నాయి.
 
"ఒక హీరో త‌న కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకుని డాక్ట‌ర్‌ని చేస్తున్నాడు.. ఒక ఇంజ‌నీర్ త‌న కొడుకుని ఇంజ‌నీర్‌ని చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్ర‌మే త‌న కొడుకుని రైతుని చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టీ.. నాకు జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది."
 
"తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు." అనేవి ఆ రెండు డైలాగ్స్‌. శ‌ర్వానంద్ మాట‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఒక రైతు కొడుక‌నీ, తండ్రి బాట‌లో తాను కూడా రైతుగా మారేందుకు శ్రీ‌కారం చుట్టాడ‌నీ ఈజీగా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే రైతుగా అత‌ని ప్ర‌యాణం సాఫీగా సాగిందా, ఏమైనా అడ్డంకులు ఎదుర‌య్యాయా? అస‌లు బాగా చ‌దువుకొని కూడా రైతు కావాల‌ని అత‌ను ఎందుకు నిర్ణ‌యించుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లకు సినిమా స‌మాధానం చెప్ప‌నుంది.
 
శ‌ర్వానంద్ నోటి నుంచి వ‌చ్చిన ఈ రెండు డైలాగులే సినిమాలో సంభాష‌ణ‌లు ఎంత ఇంప్రెసివ్‌గా ఉండ‌నున్నాయో తెలియ‌జేస్తున్నాయి. బుర్రా సాయిమాధ‌వ్ క‌లం మ‌రోసారి త‌న ప‌నిత‌నం ఎలాంటిందో ఈ సినిమాలో చూపించింది. అలాగే శ్రీ‌కారం మూవీ విజువ‌ల్ బ్యూటీగా ఉంటుంద‌నేందుకు టీజ‌ర్‌లోని విజువ‌ల్స్ ఓ శాంపిల్‌. జె. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.
 
ఇక ఇదివ‌ర‌కే 'శ్రీ‌కారం'కు సంబంధించి విడుద‌ల చేసిన "బ‌లేగుంది బాలా", "సంద‌ళ్లె సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే.." పాట‌లు సంగీత ప్రియుల‌ను బాగా అల‌రిస్తున్నాయి. స‌ర్వ‌త్రా వీటికి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మిక్కీ జె. మేయ‌ర్ త‌న‌కు అల‌వాటైన త‌ర‌హాలో విన‌సొంపైన బాణీలు అందించారు.
 
చ‌క్క‌ని క‌థాక‌థ‌నాలు, ఆక‌ట్టుకొనే క్యారెక్ట‌రైజేష‌న్స్‌, ఇంప్రెసివ్ టెక్నిక‌ల్ విలువ‌ల‌తో డైరెక్ట‌ర్ కిశోర్ బి. ఈ మూవీని రూపొందిస్తున్నారు. 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ రెండో చిత్రం 'శ్రీ‌కారం'.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments