ప్రిన్స్ మహేష్ బాబు క్లాసిక్ హిట్ ఖలేజా చిత్రం రి-రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్నారు. కేకలు, ఈలలు... వగైరాలతో రెచ్చిపోతున్నారు.
ఇంతవరకూ బాగానే వుంది కానీ ఓ అభిమాని అచ్చం మహేష్ బాబులా థియేటర్లో ప్రవర్తించాడు. మహేష్ బాబు బ్లాక్ షర్ట్ ధరించి డెజర్ట్ లో పామును పట్టుకునే సీన్ వుంటుంది కదా. అలాగే నల్ల చొక్కా ధరించి థియేటర్లో పిల్లపామును చేత్తో పట్టుకుని హల్చల్ చేసాడు. అతడి చేతిలో పామును చూసిన జనం జడుసుకున్నారు.