మహేష్ అప్పుడు చబ్బీగా ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడు: రజనీకాంత్

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ ఆడియో వేడుక చెన్నైలోని కలైవానర్ అరంగం ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు విశాల్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా, చిత్ర యూనిట్ అంతా వేడుక‌లో సంద‌డి చేసింది. స్పైడ‌ర్ చి

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (12:12 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ ఆడియో వేడుక చెన్నైలోని కలైవానర్ అరంగం ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు విశాల్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా, చిత్ర యూనిట్ అంతా వేడుక‌లో సంద‌డి చేసింది. స్పైడ‌ర్ చిత్రం ద్వారా మ‌హేష్ తొలిసారి త‌మిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ మాట్లాడుతూ.. తమిళంలో తొలి సినిమా చేశానని తెలిపాడు. మురుగ‌దాస్ సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్ప‌టినుంటో ఆయ‌నతో పని చేయాల‌నుకున్నాను. స్పైడ‌ర్‌తో అది తీరింది. ఈ చిత్రాన్ని మురుగ‌దాస్ అద్భుతంగా తెర‌కెక్కించార‌ని కొనియాడాడు. 
 
ఇక లైకా ప్రొడ‌క్ష‌న్స్ రాజు మ‌హ‌లింగం మాట్లాడుతూ.. రజనీకాంత్‌గారికి ఇన్విటేషన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు మహేష్ బాబును చూసి ఎంతబావున్నాడు. చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడని.. లుక్ అదిరిందని రజనీ మెచ్చుకోవడం చూసి థ్రిల్ అయ్యానని రాజు మహలింగం తెలిపాడు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌, ర‌కుల్‌, ఎస్‌జె సూర్య ప్ర‌ధాన పాత్ర ధారులుగా నటించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.
 
ఇకపోతే స్పైడర్ ఆడియో వేడుకలో తెలుగు, త‌మిళ భాష‌ల‌కి సంబంధించిన పాట‌ల‌ను విడుద‌ల చేశారు. మ‌హేష్‌, మురుగ‌దాస్, విశాల్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. ఇక స్పైడ‌ర్ చిత్ర హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్, మ‌హేష్ బాబు ఫ్యాన్‌తో క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. సిసిలియా సాంగ్‌కి ర‌కుల్ లైవ్‌లో వేసిన స్టెప్పులు మ‌హేష్ అభిమానుల‌కి అమితానందాన్ని క‌లిగించాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments