Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మూవీకి రెడీ అయిన మహేష్ బాబు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (13:53 IST)
గతేడాది టాలీవుడ్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడం గురించి ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌ను ప్రకటించగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలై నాలుగు నెలలైంది. మహేష్ తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కాల్సి ఉండగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమైతే మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
త్రివిక్రమ్ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నారని భోగట్టా. మరోవైపు మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 
 
ప్రతి ప్రాజెక్ట్ కచ్చితంగా సక్సెస్ సాధించేలా మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు యాడ్స్‌లో నటిస్తూనే మరోవైపు వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. 
 
మహేష్ బాబు ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ పెరుగుతుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments