Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' దర్శకుడితో మహేష్...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:11 IST)
చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు... మహేష్ బాబు తన చేసిన 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తనతో సినిమా చేయాలనుకునే దర్శకులు ఎవరైనా పూర్తి స్క్రిప్టుతో వచ్చి, అది తనకు నచ్చితేనే సినిమా చేసేందుకు మహేష్ ఓకే చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తన చేయబోయే సినిమా విషయంలో మహేష్ పాటిస్తున్న కఠిన నిబంధన ఇది. 
 
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్న మహేష్‌కి... దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. ఈ సంవత్సరం చివరి వరకు సినిమా పూర్తిచేసి వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనిల్ ప్లాన్. ఈ రెండింటి తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. 
 
రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికీ... అవి ఎంతవరకు నిజమో తెలియదు. అయితే తాజాగా 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్ రీసెంట్‌గా మహేష్ బాబును కలిసి ఓ లైన్ వినిపించాడట. లైన్ బాగుంది డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
లైన్ డెవలప్ చేసి పూర్తి స్క్రిప్టుతో వచ్చి మహేష్‌ను మెప్పిస్తే.. సినిమా చేసే అవకాశం వస్తుంది. లేదంటే.. లేనట్టే. ఒకవేళ పరశురామ్ మహేష్‌ను ఒప్పించగలిగితే.. ఈ సెన్సేషనల్ జోడీ మరో సూపర్ హిట్ ఇవ్వనున్నారో... మొత్తం మీద ఏం జరగనుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments