Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్: కృష్ణ పాత్రలో మహేష్ బాబు.. జయలలితగా కాజల్ అగర్వాల్?

తేజ దర్శకత్వంలో దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబుని నటించాల్సిందిగా బా

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (14:46 IST)
తేజ దర్శకత్వంలో దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబుని నటించాల్సిందిగా బాలకృష్ణ కోరారట. ఇందుకు మహేష్ బాబు కూడా హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కాజల్ అగర్వాల్ నటించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కథానాయకుడిగా ఎన్టీఆర్‌తో ముడిపడిన పాత్రల కోసం రాజకీయ నేతల పాత్రల కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.

ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల కోసం కాజల్ అగర్వాల్‌ను సంప్రదించినట్లు సమాచారం. నిడివి తక్కువైనప్పటికీ ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో కాజల్ జయలలిత రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments