Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి గొప్ప మనసు.... ప్రభాస్ - ప్రిన్స్ రూ.25 లక్షలు... ఎన్టీఆర్ కూడా...

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్ కూడా పెద్ద మనసుతో కేరళ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈయన తన వంతు సాయంగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (15:44 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్ కూడా పెద్ద మనసుతో కేరళ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈయన తన వంతు సాయంగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
 
నిజానికి కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు హీరోలంతా ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఆదివారం హీరోలు నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, కళ్యాణ్ రామ్‌లు తమ వంతు సహాయాన్ని ప్రకటించగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ముందుకొచ్చారు.
 
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు వరుణ్ తేజ్ ప్రకటించారు. ఇక మెగా హీరోల నుండి కొద్దిరోజుల క్రితమే అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కూడ ఎక్కువ మొత్తంలో విరాళాల్ని అందించిన సంగతి తెలిసిందే. 
 
ఇక ఎన్టీఆర్ తన వంతుగా కేరళ బాధితుల సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా తన సహాయంగా 10 లక్షల రూపాయల్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించేందుకు ముందుకొచ్చారు. 
 
అదేవిధంగా 'బాహుబలి' ప్రభాస్ 25 లక్షల రూపాయలను ప్రకటించారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ రూ.35 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రిన్స్ మహేష్ బాబు రూ.25 లక్షలు, మెగా ఫ్యామిలీ తరపున అంజనా దేవి రూ.లక్ష, చిరంజీవి రూ.25 లక్షలు, రామ్ చరణ్ రూ.25 లక్షలు, ఉపాసన రూ.10 లక్షలతో పాటు మందులను కూడా పంపించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments