Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుకు 23 ఏళ్ళు

Webdunia
శనివారం, 30 జులై 2022 (22:36 IST)
Mahesh Babu
న‌ల‌భై ఏళ్ళు దాటిన మ‌హేస్‌బాబుకు 23 ఏళ్ళు అనుకుంటున్నారా.. మ‌రి చూస్తానికి అలానే వుంటాడు. అస‌లు మ‌హేష్‌బాబు న‌టుడిగా తొలి సినిమా విడుద‌లై నేటికి స‌రిగ్గా 23 ఏళ్ళ‌యింద‌న్న‌మాట‌. 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా రాజకుమారుడు. 30 జులై, 1999న విడుద‌లైంది. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. 
 
ఆ త‌ర్వాత ఒక్కో సినిమాకు ఎత్తు ప‌ల్లాలు చూసిన మ‌హేష్‌కు పోకిరి ఒక్క‌సారిగా మాస్ హీరోగా చేసేసింది. అటు క్లాస్ పీపుల్ కూడా మెచ్చారు. ఇక శ్రీ‌మంతుడు వంటి సామాజిక అంశాన్ని కూడా చేసిన ఆయ‌న స‌ర్కారువారిపాట‌తో మ‌రింత పేరు తెచ్చుకున్నారు. హిట్లు ప్లాప్‌ల‌ను స‌మానంగా చూసే మ‌హేష్‌బాబుకు ఆయ‌న అభిమానులు నేడు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లే వెకేష‌న్‌కు విదేశాల‌కు వెళ్ళి తిరిగి వ‌చ్చిన మ‌హేష్  తాజాగా త‌న 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌తో చేస్తున్నాడు. ఆగ‌స్టునుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments