Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆట సూస్తావా.." అంటున్న మహేశ్ బాబు.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (09:11 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". హారిక హాసిని బ్యానరుపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో మహేశ్ బాబు మాస్ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తే... మాస్ హీరోగా ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క .. ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయనను చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్‌ను వదిలారు. మహేశ్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ .. 'ఆట సూస్తావా' అనే ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్‌లో జరిగే ఫైట్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
మొత్తం మీద ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీమ్ ప్రయత్నం ఫలించేలానే కనిపిస్తోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసమే మహేశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments