Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రేమకథ ఓ జర్నీలా సాగిపోయిందన్న ప్రిన్స్: వాలెంటైన్ డేపై నమ్మకం లేదు!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (18:47 IST)
తన ప్రేమకథ ఓ జర్నీలా సాగిపోయిందని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు. 40 ఏళ్ల వయస్సులో కుర్రాడిలా ఉన్న మహేష్ బాబు ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు. ప్రేమ అనేది మన చేతుల్లో ఉండదని, అదొక బంధమని మహేష్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రేమ కథను నాలుగేళ్ల తర్వాతే పెద్దలకు చెప్పానని మహేష్ బాబు తెలిపారు. 
 
పెద్దలకు కూడా తన నిర్ణయం మీద నమ్మకం ఉందని, అందుకే ఎవరూ అడ్డుచెప్పలేదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తమది పెద్దలను ఒప్పించి చేసుకున్న ప్రేమ వివాహమని మహేష్ తెలిపారు. పెళ్లి తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని ప్రిన్స్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే... కృష్ణగాడి ప్రేమకథ హీరో నాని మాత్రం వేలెంటైన్ డేని పట్టించుకోనని చెప్తున్నారు. తనకు మొదటి నుంచి దీనిపై ప్రత్యేక అభిమానమేదీ లేదని నాని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకున్నా వేలెంటైన్స్ డే అన్నది మన దేశానికి సంబంధించినది కాదని తెలిపారు. అంతేగాకుండా.. షూటింగ్‌ల నిమిత్తం బిజీగా ఉండటంతో వేలెంటైన్స్ డే గుర్తుండేది కాదని.. ప్రేమికుల రోజును తాను నమ్మనని చెప్పారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments