Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున చేతుల మీదుగా 7న 'బ్రహ్మోత్సవం' ఆడియో.. వర్కింగ్ స్టిల్స్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (15:46 IST)
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం'. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మరోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోని ముందుగా మే 1వ తేదీన తిరుపతిలో రిలీజ్ చెయ్యాలని భావించిన చిత్ర టీం తర్వాత మే 7న హైదరాబాద్ శిల్పకళావేదికలో విడుదల చెయ్యడానికి డిసైడ్ చేశారు. 
 
ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'రాజకుమారుడు' చిత్రం ఆడియోకి నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ఎంట్రీ చిత్రం 'అఖిల్' చిత్రం ఆడియోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
ఇప్పుడు తాజాగా నాగార్జున మహేష్ 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియోకి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర బృందం ఫేస్‌బుక్‌లో వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. పివిపి బ్యానర్‌పై వస్తున్నఈ చిత్రంలో సీనియర్ నటి జయసుధ, రేవతి, ప్రముఖ నటుడు సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 20న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments