Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017లో 24-25-26 సినిమాలు ఆ ముగ్గురితో చేస్తున్నా.. ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..

బ్రహ్మోత్సవం ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టకపోవడంతో తదుపరి సినిమాల ఎంపికలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పనిలో పనిగా సినిమాల వేగాన్ని పెంచుతున్నారు. ఓ సినిమా సెట్స

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (09:00 IST)
బ్రహ్మోత్సవం ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టకపోవడంతో తదుపరి సినిమాల ఎంపికలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పనిలో పనిగా సినిమాల వేగాన్ని పెంచుతున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూడు చిత్రాల్ని అంగీకరించారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మురుగదాస్‌తో పనిచేయాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు ఫేమ్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు కూడా మహేష్ తెలిపారు. మహేష్ నటించనున్న ఈ 24వ సినిమాను డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు ప్రిన్స్. 
 
దిల్‌రాజు, అశ్వినిదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభం కానుంది. తన 26వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తారని... మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments