Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ఆగిపోయిందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. డెహ్రాడూన్

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:53 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. డెహ్రాడూన్లో ప్రారంభ‌మైన ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. ఇదిలావుంటే.. తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింద‌ని స‌మాచారం.
 
ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత తదుపరి షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లనుంది చిత్ర బృందం. అయితే ఈ షెడ్యూల్ కోసం మహేష్ బాబుతో పాటు తన ఫ్యామిలీ కూడా అమెరికా రానుంది. సుమారు 25 రోజుల పాటు అక్కడ జరుగనున్న ఈ షెడ్యూల్లో చిత్రానికి కీలకం కానున్న సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments