కీర్తి సురేష్ 'సావిత్రి'లా జీవించింది... దు.సల్మాన్ ఫ్యాన్‌ను అయిపోయా... రాజమౌళి పొగడ్తలు

మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి నటీమణులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడనీ, సావిత్ర

Webdunia
బుధవారం, 9 మే 2018 (15:15 IST)
మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి నటీమణులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడనీ, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసిందంటూ ట్వీట్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటన చూసి తను ఆయనకు అభిమానిని అయిపోయానంటూ వెల్లడించారు. మహానటి సావిత్రి గారిలా కీర్తి సురేష్ నటన అద్భుతంగా వుందని కొనియాడారు.
 
ఇకపోతే.. మహానటికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు ఆడియెన్స్ చెపుతున్నారు. అవార్డుకు అర్హత కలిగిన చిత్రంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడుగా నాగ అశ్విని మంచి చిత్రాన్ని తీశారనీ, కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ నటన అద్భుతంగా వున్నదంటూ కితాబిస్తున్నారు. ఈ చిత్రం రేటింగ్ 3.75/5 అంటూ పేర్కొనడం గమనార్హం. 
 
యూఎస్‌లో ఇప్పటికే ఈ చిత్రం $230k వసూలు చేసింది. మిలియన్ డాలర్ల క్లబ్బులోకి ప్రవేశిస్తుందంటూ రిపోర్టులు చెపుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి మెగా నిర్మాత అశ్వినీ దత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహించగా, దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments