Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహాభారత్" సీరియల్ భీముడు ఇకలేరు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:28 IST)
దేశాన్ని ఉర్రూతలూగించిన "మహాభారత్" సీరియల్‌లో భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోబ్తి ఇకలేరు. ఈయన వయసు 74 యేళ్లు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టు కారణంగా సోమవారం రాత్రి 10.30 గంటల సయమంలో తుది శ్వాస విడిచారు. 
 
గత కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఫ్యామిలీ వైద్యుడిని ఇంటికి పిలిపించారు. అప్పటికే చేయిదాటిపోయింది. 
 
ఈయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిథ్యం కూడా వహించారు. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగు పతకాలను సాధించాడు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకతాలను  గెలుచుకున్నారు. 
 
1988లో బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారత్ సీరియల్‌తో ఆయన తన యాక్టింగ్ కేరీర్‌ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments