Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్‌ జరుపుకుంటున్న 'మహాబలి'... 6న ఆడియో రిలీజ్

ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్‌గా రవికిరణ్‌ వికాస్‌ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఇటీవలే రిలీజై సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రం కన్నడంలో

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (18:38 IST)
ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్‌గా రవికిరణ్‌ వికాస్‌ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఇటీవలే రిలీజై సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రం కన్నడంలో 35 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసి సెన్సేషన్‌ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి తెలియజేస్తూ... 
 
హండ్రెడ్‌ పర్సెంట్‌ యాక్షన్‌ అండ్‌ లవ్‌తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా కన్నడంలో రూపొందిన 'జయమ్మన మగ' చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్‌ నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది. 
 
శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం మరొక సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్‌ జన్య ఐదు పాటల్ని చాలా డిఫరెంట్‌గా కంపోజ్‌ చేశాడు. అలాగే రీరికార్డింగ్‌ అద్భుతంగా చేశాడు. దర్శకుడు రవికిరణ్‌ టేకింగ్‌, దునియా పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాశారు. సెప్టెంబర్‌ 6న చిత్ర ఆడియోను రిలీజ్‌ చేసి అదే నెలలో సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. 
 
దునియా విజయ్‌, డా. భారతి, కళ్యాణి రాజు, ఎన్‌.ఎల్‌. నరేంద్రబాబు, రంఘాయన రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు-పాటలు: భారతీబాబు, సంగీతం: అర్జున్‌ జన్య, ఫొటోగ్రఫీ: సుగ్‌నాన్‌, ఎడిటింగ్‌: నాని ముత్యాల, సమర్పణ: శ్రీమతి లతా మార్టోరి, నిర్మాత: వెంకట్రావ్‌ మార్టోరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవికిరణ్‌ వికాస్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments