Webdunia - Bharat's app for daily news and videos

Install App

IFFM అవార్డ్ గెలుచుకున్న మ‌హాన‌టి...

తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన మ‌హాన‌టి ఇప్పుడు విదేశాల్లోనూ స‌త్తా చూపిస్తుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు ఎంపికైన మ‌హాన‌టి.. ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి టీం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తిసు

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (18:45 IST)
తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన మ‌హాన‌టి ఇప్పుడు విదేశాల్లోనూ స‌త్తా చూపిస్తుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు ఎంపికైన మ‌హాన‌టి.. ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి టీం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తిసురేష్.. నిర్మాత‌లు స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్ ఆ వేడుక‌కు హాజ‌రై అవార్డును అందుకున్నారు. అవార్డ్ స్వీక‌రించిన త‌ర్వాత నిర్మాత స్వ‌ప్న ద‌త్ మాట్లాడుతూ.. ఓ అద్భుత‌మైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. మ‌హాన‌టి కేవ‌లం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ అద్భుతమైన విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ నెంబ‌ర్స్ దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ సినిమా నిర్మించినందుకు చాలా గ‌ర్వంగా ఉంది అన్నారు. 
 
అవార్డ్ వేడుక త‌ర్వాత ప్ర‌ముఖ బాలీవుడ్ విశ్లేష‌కులు రాజీవ్ మ‌సంద్‌తో ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చారు మ‌హాన‌టి యూనిట్. సినిమాకు సంబంధించిన మేకింగ్ విశేషాల‌తో పాటు ఇంకా చాలా విష‌యాలు మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు.. మ‌హాన‌టిలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర్చిన కీర్తి సురేష్ ఉత్త‌మ నటి కేట‌గిరీలో నామినేట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ - హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments