Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహావంశం' ట్రైలర్‌ లాంచ్‌!

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (20:58 IST)
రహమాన్‌, ప్రియా హెండ్రి జంటగా యూస్రి అబ్దుల్‌ హలీమ్‌ దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన మలై చిత్రాన్ని ఫోకస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌‌పై గణేష్‌ నిర్మాతగా తెలుగులో 'మహావంశం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌‌ను ఆదివారం హైదరాబాద్‌‌లోని ఫిలిం ఛాంబర్‌‌లో విడుదల చేసారు.
 
ఈ సందర్భంగా.. ఫోకస్‌ ఫిల్మ్స్‌ అధినేత గణేష్‌ మాట్లాడుతూ ''120 ఎ.డిలో అమరావతి నుండి బయలుదేరిన మాడవ వంశానికి చెందినా యువకుడు సౌత్‌ ఈస్ట్‌ ఏషియాలోని లంకసుఖ రాజ్యానికి రాజు ఎలా అయ్యాడనేదే ఈ చిత్ర కథాంశం. జూలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
 
మల్టీ డైమెన్షన్‌ వాసు మాట్లాడుతూ ''ఇదొక మలేషియన్‌ చిత్రం. 120 సంవత్సరాల క్రితం జరిగిన మలేషియా చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభుత్వ సహకారంతో గణేష్‌ గారు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించిన చిత్రమిది. ట్రైలర్‌ చాలా బావుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో జూలై 3న విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
 
జవహర్‌ బాబు మాట్లాడుతూ ''ట్రైలర్‌ చాలా ఇంప్రెసివ్‌‌గా ఉంది. అందరినీ అలరించే చిత్రమవుతుంది. ఈ సినిమాతో గణేష్‌ గారికి మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌: అమీర్‌ హఫీజి, మ్యూజిక్‌: రెజరామ్‌, ఫోటోగ్రఫీ: మహమ్మద్‌ ఖాసిం, ప్రొడ్యూసర్‌-స్క్రీన్‌ ప్లే-డైరెక్షన్‌: యూస్రి అబ్దుల్‌ హలీమ్‌.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments