Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమమ్'' మడోన్నా సెబాస్టియన్.. గాయనిగా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్ అయ్యింది.. కానీ?

గాయనిగా పాటలు పాడుకున్న ఓ యువతి.. వూహించని విధంగా నటిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ప్రేమమ్‌లో మూడో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ సినిమాలో చివరిగా మడోన్నా సెబాస్టియన్‌నే రీల్ లైఫ్‌లో నాగ చైతన్య వ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:51 IST)
గాయనిగా పాటలు పాడుకున్న ఓ యువతి.. వూహించని విధంగా నటిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ప్రేమమ్‌లో మూడో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ సినిమాలో చివరిగా మడోన్నా సెబాస్టియన్‌నే రీల్ లైఫ్‌లో నాగ చైతన్య వివాహం చేసుకుంటాడు. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నా.. ప్రాణప్రదమైన సంగీతాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని మడోన్నా సెబాస్టియన్ తేల్చి చెప్పింది. సినీ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మధ్య మధ్యలో తన గాత్రంతో శ్రోతలను అలరిస్తోంది. 
 
మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి, గాయని మడోన్నా సెబాస్టియన్‌. తెలుగు 'ప్రేమమ్‌'లో నాగచైతన్య సరసన నటించి ఇక్కడి యువతను కూడా బాగానే మెప్పించింది. మలయాళ సంగీత కార్యక్రమం మ్యూజిక్‌ మోజో ద్వారా మడోన్నా గాయనిగా కెరీర్‌ను ప్రారంభించింది. దీపక్‌దేవ్‌.. గోపీ సందర్‌ సంగీత దర్శకత్వంలో మడోన్నా పాడిన అనేక గీతాలు సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయాయి. 
 
ఎంతో మంది సంగీత కళాకారుల్ని.. గాయకులను అందించిన కప్పా టీవీ కార్యక్రమాల ద్వారా కేరళ అంతటా మడోన్నా పాటలు మారుమోగాయి. గాయనిగానే కాకుండా నటిగా అనేక అవకాశాలు కల్పించాయి. సూర్య టీవీలో మడోన్నా చేస్తున్న ఓ కార్యక్రమం మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే మడోన్నా ప్రేమమ్ సినిమాకు ఎంపికైంది. ప్రస్తుతం అమ్మడు మలయాళం, తమిళం, తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. చిన్నతనం నుంచి సంగీతాన్ని జీవితంలో ఓ భాగం చేసుకున్న మడోన్నా.. నటిగా బిజీగా ఉన్నా.. పాటలు పాడటం మాత్రం ఆపలేదు. పాటలు పాడటం మాత్రం ఆపలేదు. 
 
తొలి ప్రాధాన్యత సంగీతానికే ఇస్తోంది. ఇటీవలే దుబాయ్‌ రేడియో స్టేషన్‌ కోసం దీపక్‌ దేవ్‌ స్వరపరిచిన జింగిల్స్‌ను మడోన్నా ఆలపించింది. అక్కడ కూడా మంచి గాయనిగా మరింత పేరు సంపాదించుకుంది. అదన్నమాట మడోన్నా సంగతి. ఎనీవే గాయనిగా, నటిగా మడోన్నా రాణించాలని మనమూ ఆశిద్దాం..
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments