Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ నుంచి మధువరమే.. గీతం విడుదల

డీవీ
గురువారం, 16 జనవరి 2025 (16:29 IST)
anupuma, pradeep
‘లవ్ టుడే’తో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా తాజాగా రూపొందిస్తోన్న చిత్ర‌మే ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో 26వ సినిమాగా ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’ రూపొందుతోంది.
 
ఇంతకు ముందు రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రైజ్ ఆఫ్ డ్రాగ‌న్ అనే ఎన‌ర్జిటిక్ సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ గీతాన్ని విడుదల చేశారు.
 
లియోన్ జేమ్స్ అందించిన బాణీ, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం, శరత్ సంతోష్, శ్రినిష జయసీలన్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటను యూరోప్‌లో షూట్ చేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ పాట వినడానికే కాకుండా చూడటానికి కూడా ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తోంది.
 
ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రంలో కె.ఎస్‌.ర‌వికుమార్‌, మిస్కిన్‌, వి.జె.సిద్ధు, హ‌ర్ష‌త్ ఖాన్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, క‌యాదు లోహ‌ర్, మ‌రియం జార్జ్‌, ఇందుమ‌తి మ‌ణికంద‌న్‌, తేన‌ప్ప‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్టీ గీత దాటిన జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్!

కోడిపందేలు గ్రౌండ్స్‌లో జనసేన పార్టీ జెండాలు.. రాజా సస్పెండ్

జనవరి 18న ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

తల్లికి వివాహేతర సంబంధం అంటగట్టాడు.. 19 ఏళ్ల కుమారుడిని చంపేసిన దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments