Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

దేవీ
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (11:15 IST)
Madhunandan
యుగంధర్ ముని దర్శకత్వంలో ప్రతిష్టాత్మక షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ప్రామిసింగ్ స్టార్ ఆది సాయికుమార్ మొదటి సారిగా సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, అర్చనా అయ్యర్, స్వసిక కారెక్టర్ లుక్ పోస్టర్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ ఇప్పుడు మరో కీలక పాత్రను పరిచయం చేశారు.
 
టాలెంటెడ్ ఆర్టిస్ట్ మధునందన్ ఈ శంబాల చిత్రంలో హనుమంతు అనే కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్రకు సంబంధించి పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖంపై భయం.. లాంతరు పట్టుకుని దిక్కులు చూస్తున్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్.. వెనుక గోడపై ఒక దిష్టిబొమ్మ, వెనకాల ఒక ఆలయం ఇవన్నీ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగేలా ఉంది.
 
ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.
 
హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మెర్‌తో కలిసి పనిచేసిన భారతీయ స్వరకర్త శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. పురాతన యుగం, వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా ఓ అద్భుతమైన కల్పనకు ప్రాణం పోస్తున్నారు. విజువల్ వండర్‌గా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో శంబాల చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments