Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (11:39 IST)
Narne Nitin, Sangeet Shobhan, Ram Nitin
'మ్యాడ్' కోసం పని చేసిన వారంతా 'మ్యాడ్ స్క్వేర్' కోసం పని చేస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తోపాటు భీమ్స్ సిసిరోలియో సంగీతం, ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని చేశారు. ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నేడు ప్రకటించారు.
 
సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
 
మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేశారు. రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.
 
శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments