Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ, శ్రీలీల ధమాకా నుండి లిరికల్ వీడియో రాబోతుంది

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:56 IST)
Raviteja
మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మేకర్స్ చార్ట్‌బస్టర్‌ 'జింతాక్‌'తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా ఈనెల 23న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాట సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ అని టైటిల్ సూచిస్తోంది. మాస్ రాజా సాంగ్‌లో మాస్ మహారాజా మాస్ డ్యాన్స్‌లను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో ఆదరగొట్టడానికి రెడీ అయ్యారు.  
 
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల, రవితేజకి జోడిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments