Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ సందేహ మూవీ నుంచి దర్శకుడు దశరథ్ రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్

Webdunia
శనివారం, 29 జులై 2023 (13:52 IST)
sandeham team with dhasaradh
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. 

ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్య‌క్ర‌మంలో ద‌శ‌రథ్‌తో పాటు మ‌న చౌద‌రి, చిత్ర యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
 *డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ...* ‘‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాట‌ను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గారు, హీరో సుమ‌న్‌, హెబ్బా ప‌టేల్ ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 
 
 *మ‌న చౌదరి మాట్లాడుతూ...* ‘‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాట‌ను పూర్ణాచారి రాశారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్.   శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments