Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ అందాలు చూపే చివ‌రి చిత్రంగా లవ్ ఇన్ ఉక్రెయిన్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (11:49 IST)
Love in Ukraine
ఇప్పుడు ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి తెలియ‌నివారు వుండ‌దు. యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లో చాలా సినిమాలు షూట్ జ‌రిగాయి. అన్ని భాష‌ల సినిమాలు అక్క‌డ అందాల‌తో బంధించ‌బ‌డ్డాయి. తాజాగా యుద్ధానికి ముందు అక్క‌డి న‌టీన‌టుల‌తో తీసిన సినిమా లవ్ ఇన్ ఉక్రెయిన్. ప్రేమ, శృంగారం, స్నేహం జీవితంపై   రిఫ్రెష్ టేక్ "లవ్ ఇన్ ఉక్రెయిన్ అవుతుంది. కమల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ & నియోల్ ఫిల్మ్స్ లవ్ ఇన్ ఉక్రెయిన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. విశాల్ శర్మతో కలిసి నితిన్ కుమార్ గుప్తా రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ పోస్టర్‌కి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
 
క‌థ ప్ర‌కారం చూస్తే, భార‌త‌దేశంనుంచి చ‌దువుకోసం వెళ్ళి అక్క‌డ ర‌ష్య‌న్ అమ్మాయి ప్రేమ‌లో ప‌డిన కుర్రాడి క‌థ‌. చివ‌రికి ఆమె ఇంటివారు మాఫియా వ్య‌క్తికి ఇచ్చి పెండ్లిచేయ‌బోతారు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రు ప్రేమికులు ఎలా అడ్డంకుల‌ను ఫేస్ చేశార‌నేది పాయింట్‌. ఇది యుద్ధానికి ముందు తీసిన సినిమా కాబ‌ట్టి అస‌లు ఉక్రెయిన్ అందాల‌న్నీఈ సినిమాలోనే చూడ‌వ‌చ్చ‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నారు. ఉక్రెయిన్ గ్రామాల్ల‌లోకూడా క‌థ ప్ర‌కారం షూట్ చేశామ‌నీ, అక్క‌డి ప‌ద్ధ‌తులు సాంప్ర‌దాయులు కళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూడొచ్చ‌ని అంటున్నారు. 
 
ఇందులో న‌టించిన తారాగణం మరియు సిబ్బంది ఇప్పటికీ యుక్రెయిన్‌లో యుద్ధ ప్రాంతంలో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు.   అక్కడ రష్యన్ బాంబులు విమానాశ్రయాన్ని నాశనం చేశాయి. వివేక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ చిత్రాన్ని  2022 మే 27న థియేటర్లలో విడుద‌లచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
 
లవ్ ఇన్ ఉక్రెయిన్ నిర్మాతలు ఉక్రెయిన్ ప్రజలకు భారతీయ చిత్రనిర్మాతల ప్రేమ, సంఘీభావానికి చిహ్నంగా ఉక్రెయిన్‌లో ఉచిత విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని అన్నిచోట్ల  విడుద‌ల‌కాక‌పోవ‌చ్చ‌ని వారు తెలిపారు. 
 
లిజబెటా, N.K.G., మైఖేల్ స్ట్రిగా, లోలిత జురావ్‌లోవా, రోమన్ బాట్రిన్, రుస్లాన్ సెఫెరోవ్, ఒలెస్ డిమిత్రెంకో, ఇర్మా బాలన్, కాన్‌స్టాంటిన్ షిరియావ్, వ్లాదిమిర్ డిడెన్‌కో మరియు సెర్గీ ప్షెనిచ్నితో విపిన్ కౌశిక్ నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments