Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో థియేట‌ర్ల లొల్లి - సంక్రాంతికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు టార్గెట్‌!

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (08:34 IST)
theater
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఓటీటీ థియేట‌ర్ల‌కు పోటీగా వుంద‌నేది తెలిసిందే. కానీ థియేట‌ర్ల‌లో పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌కావాల‌ని నిర్మాత‌లు ప‌ట్టుప‌డుతున్నారు. అందుకు సంక్రాంతికి మ‌రీ పోటీ ఏర్ప‌డింది. దీనికి సంబంధించి బుధ‌వారంనాడు ఫిలింఛాంబ‌ర్‌లో గిల్డ్ నిర్మాత‌లు (ఛాంబ‌ర్‌లోని అ్ర‌గ నిర్మాత‌ల గ్రూప్‌) స‌మావేశం జ‌రిగింది. 
 
క‌రోనా త‌ర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. అందులో అ్ర‌గ‌హీరోల సినిమాలే వున్నాయి. అవి షూట్ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లు జ‌రిపి ఒకేసారి విడుద‌ల‌కు వ‌చ్చేశాయి. దాంతో థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో రిలీజ్ డేల్ కొంద‌రు ఇచ్చేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సిద్ధంగా వున్నాయి. ఇక మ‌హేష్‌బాబు “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. థియేట‌ర్ల కొర‌త‌తో వారు వాయిదా వేసుకున్నారు. 
 
కానీ మిగిలిన మూడు సినిమాలు త‌గ్గేదేలే అన్న‌ట్లుగా వుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాను వాయిదా వేసుకోవాల‌ని స‌మావేశంలో కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. దీనిపై నిర్మాతలు నాగ‌వంశీపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సంప్ర‌దించి మ‌రోసారి మా సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని అప్ప‌టిక‌ప్ప‌డు నిర్మాత మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే భీమ్లా నాయక్’ జనవరి 12న డేట్ చెప్పాక ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు అన్ని సిద్ధం చేసుకుని వున్నారు. 
 
వైసిపి హ‌స్తం వుందా!
కేవ‌లం భీమ్లానాయ‌క్ సినిమాపైనే ఒత్తిడి రావ‌డంతో ఆంధ్ర‌లో సంక్రాంతికి మంచి క‌లెక్ష‌న్లు వుండ‌డంతో ఇది ఆంధ్ర సి.ఎం. ఒత్తిడి ఏమైనా వుందేమోన‌ని ఓ నిర్మాత సందేహం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ప‌వ‌న్ కూడా మాట్లాడుతూ, ఆపితే నా సినిమాను ఆపుకోండి. కానీ మిగిలిన సినిమాల జోలికి రాకండి.. అంటూ ఓ సంద‌ర్భంలో వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా జ‌రిగింది.
 
క‌నుక ఈ విష‌యం మ‌రింత తీవ్ర రూపం కాకుండా ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. అందుకే రాబోయే సంక్రాంతి సినిమాల‌కు సామరస్యపూర్వక పరిష్కారం కోసం నిర్మాతల సంఘం మ‌రోసారి  గురువారంనాడు  సమావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఫైన‌ల్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యం ఎలా వుంద‌నేది నిర్మాత మాట్ల‌ల్లో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments