Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ యంగ్ సెన్సేషనల్ మేకింగ్ డైరెక్టర్ సంచలన ప్రకటన.. ఎంటది?

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (08:48 IST)
తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్ సెన్సేషనల్ మేకింగ్ డైరెక్టరుగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనకరాజ్ సంచలన ప్రకటన చేశారు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తూ వచ్చిన లోకేశ్.. ప్రస్తుతం అగ్రహీరో హీరో విజయ్‌తో "లియో" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఇందులో లోకేశ్ మాట్లాడుతూ, హాలీవుడ్ దర్శక లెజెండ్ క్వింటెన్ టరెంటినోలా తరహాలో తాను కూడా పది సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించి సంచలనం రేపాడు. 
 
తన సుధీర్ఘ ప్రయాణంలో ప్రణాళికలంటూ ఏవీ లేవు. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనీ లేదు. సినిమాలు తీసేందుకు ఇక్కడకు వచ్చా. మొదట షార్ట్ ఫిల్మ్ తీశా. కాస్త పట్టు చిక్కాక దీన్నో వృత్తిగా భావించాను. నేను పది సినిమాల వరకూ చేస్తారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్లిపోతా. ఒక కథలో సినిమాటిక్ యూనివర్శ్ సృష్టించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రతి సినిమాకు సంబంధించిన నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. తనతో పని చేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు. వారి వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది. ఎల్.సి.యూలో పది సినిమాలు వస్తాయేమో చూద్దాం. రెండోసారి విజయ్ అన్నతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు. 
 
చెర్రీ దంపతులకు కాలభైరవ స్పెషల్ గిఫ్ట్.. 
 
గ్లోబల్ స్టార్ రాం చరణ్ - ఆయన సతీమణి ఉపాసన దంపతుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ ప్రత్యేక బహుమతిని క్రియేట్ చేశారు. దీన్ని చెర్రీ దంపతులకు పంపించారు. రాం చరణ్ భార్య ఉపాసన మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆమ సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, మంగళవారం ఉదయం ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. 
 
అయితే, ఈ దంపతుల కోసం కాలభైరవ ప్రత్యేక ట్యూన్‌ను రూపొందించారు. ఈ ప్రత్యేక బాణీని కాలభైరవ.. చెర్రీ దంపతులకు కానుకగా పంపించారు. ఊహించని బహుమతితో చెర్రీ, ఉపాసన దంపతులు ముగ్ధులయ్యారు. బిడ్డకు స్వాగతం పలికిన ఆనందంలో ఉన్న తమకు ఈ మ్యూజికల్ గిఫ్ట్ మరింత ఆనందం కలిగించిందంటూ కాలభైరవకు చెర్రీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఈ ట్యూన్ సంతోషం కలిగిస్తుందని భావిస్తున్నట్టు చెర్రీ పేర్కొన్నాడు.
 
మెగా ఇంట మరో మహాలక్ష్మి... 
 
మెగా ఫ్యామిలీ ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్జ జన్మించింది. జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆస్పత్రి ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో మెగా ఇంటా సంబరాలు మిన్నంటాయి. యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన చేసింది. ఈ విషయం తెలియగానే తల్లీబిడ్డలను చూసేందుకు మెగాఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి క్యూకట్టారు.
 
కాగా, చెర్రీ దంపతులకు ఆడిబిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబాల్లో సంబరాలు మిన్నంటాయి. చెర్రీ తన కుమార్తెను చూసి మురిసి పోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్స్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు కుటుంబాలు మంగళవారం ఉదయం 7 గంటలకు ఆస్పత్రికి వెళ్లి చెర్రీ - ఉపాసన దంపతుల కుమార్తెను చూసి, ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. 
 
కాగా, 2012లో ఈ దంపతులకు వివాహం జరిగిన విషయం తెల్సిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టుగా గత యేడాది నవంబరు నెల 12వ తేదీన వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే ఉపాసనకు సీమంతం దుబాయ్ వేదికగా ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఇకపోతే, పెళ్లయిన నాటి నుంచి వేరుగా ఉంటున్న చెర్రీ దంపతులు.. తమ బిడ్డ కోసం మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లనున్నట్టు ఇటీవల ఉపాసన తెలిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments