Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమమాలిని సానుభూతి ఎందుకు? ఇదీ హిట్ అండ్ రన్ కేసే: నెటిజన్స్

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (16:04 IST)
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, బాలీవుడ్ అలనాటి తార హేమమాలిని కారు యాక్సిడెంట్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. హేమమాలిని కారు ప్రమాదంల గాయాలపాలైన హేమమాలిని పట్ల నేతలు సానుభూతి ప్రకటించడంపై సోషల్ మీడియాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టనబెట్టుకుందని, మరో బాలుడు రెండు కాళ్లూ కోల్పోగా.. వారిపై జాలి చూపని నేతలు హేమమాలినికి సంతాపం వ్యక్తం చేయడం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 
 
గాయపడ్డ వారిని వదిలేసి తాను మాత్రం ఆసుపత్రికి వెళ్లారని, హేమమాలిని బాధ్యతలను విస్మరించడం ఎంతవరకు సబబు అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కూడా హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ప్రవర్తనలాగానే ఉందని నెటిజన్స్ దుయ్యబట్టారు. 
 
కారు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ప్రభుత్వాసుపత్రికి, హేమమాలినిని మాత్రం అత్యాధునిక ఫోర్టీస్ ఆసుపత్రికి పంపడం వివక్షేనన్నారు. సామాన్యులకు దిక్కులేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఇంకా కారు ప్రమాదంపై నెటిజన్స్ హేమమాలినిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments