Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

దేవీ
శుక్రవారం, 28 నవంబరు 2025 (17:11 IST)
Eesha Rebba, Raashi Singh, Kushita Kallapu
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్". ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
 
లైఫ్ ఈజ్ ఎ గేమ్ పాటకు భాస్కరభట్ల రవికుమార్ ఇన్స్ పైరింగ్ లిరిక్స్ రాయగా, లిప్సిక అందంగా పాడారు. అజయ్ అరసాడ ఛాట్ బస్టర్ ట్యూన్ చేశారు. "త్రీ రోజెస్" సీజన్ 2 సిరీస్ లో ఫీమేల్ లీడ్ రోల్స్ చేసిన ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సందర్భంగా ఈ సాంగ్ ను రూపొందించారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ' లైఫ్ అంటేనే ఆగని ఆట, కథ ముగిసేది ఆగిన చోట, గెలుపే లేని పందెం ఉందా, నేడో రేపో పరిచయమవనంటుందా, ఎన్నాళ్లు ఎన్నాళ్లు ఎన్నాళ్లిలా, కల జారిపోతుంటే కన్నీళ్లలా, కల్లాలు సంకెళ్లు తెంచాలిగా, నీ లైఫ్ , నీ బాసు నువ్వేగా..' అంటూ సాగుతుందీ పాట. మల్టిపుల్ లొకేషన్స్ లో గ్రాండ్ గా ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments