Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకు జట్కాబండి.. గీత కామెంట్స్‌పై విమర్శలు.. అమ్మాయిల ప్రేమ.. సిగ్గులేదా అంటూ తీవ్రవ్యాఖ్యలు

టీఆర్పీల రేటింగ్ కోసం నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాలు టీవీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామే బ్రతుకు జట్కాబండి. ఈ ప్రోగ్రామ్‌లో మాజీ సినీ నటి గీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (17:34 IST)
టీఆర్పీల రేటింగ్ కోసం నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాలు టీవీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామే బ్రతుకు జట్కాబండి. ఈ ప్రోగ్రామ్‌లో మాజీ సినీ నటి గీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అంతేగాకుండా విమర్శలకు దారితీశాయి.

తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ లెస్బియన్ జంట టీవీ షోకొచ్చింది. ఆసక్తిరేపే విధంగా పోగ్రామ్ డిజైన్ చేసారు కానీ కాస్త రసాభాస జరిగిపోయింది. ఈ ప్రోగ్రామ్‌కు వచ్చిన ఆమె తాను సింధు అనే అమ్మాయితో ఉంటున్నాను అని చెప్పింది. తన తల్లిదండ్రులు తనకు ఎలాంటి సౌకర్యాలు చేకూర్చలేదని, సింధు తనను బాగా చూసుకుంటుందని సదరు అమ్మాయి చెప్పింది.  
 
సింధు నీకెందుకు కావాలి అని గీత అడిగిన ప్రశ్నకు.. ఆమెతో హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఏ విధంగా హ్యాపీగా ఉంటావు.. అంటే అన్ని రకాలుగా అంటే .. మళ్లీ ఏ రకం అని గుచ్చి గుచ్చి అడిగారు. సమాజంలో ఉండే వ్యతిరేకతను నిలదొక్కుకుని జీవించగలరా అని అడిగారు. సమాజం తనకు అవసరం లేదని అమ్మాయి బదులిస్తే.. ఎలా అవసరం లేదు.. మనం అడవిలో లేము కదా అని గీత ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా మీ అక్క ఎవరిని చేసుకుంది.. అబ్బాయిని కదా. మరి సింధు ఎవరో చెప్పు ఫస్ట్.. అమ్మాయి కదా.. అమ్మాయి.. అమ్మాయి ఇద్దరు కలిసి ఉండచ్చా అని డైరక్ట్‌గా ఆమెను అడిగారు. ఆమె ఉంటాము అని సమాధానమిచ్చింది. పిల్లలు వద్దు, శారీరక సుఖం అవసరమూ లేదని చెప్పింది. సాధారణంగా పెళ్ళి జరుగుతుందో అలాగే మా పెళ్లి జరుగుతుందని చెప్పింది.

ఇలాంటి అనుబంధాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని, వీటిని భారతదేశంలో పాటించకూడదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అమ్మాయితో కలిసి తిరగడానికి నీకు సిగ్గులేదా? ఇలా చేస్తే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ గీత బెదిరింపులకు దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. 
 
గత నెల 31న ప్రసారమైన 'బతుకు జట్కాబండి' షోలో 20 ఏళ్ల అమ్మాయి, 23 ఏళ్ల లింగమార్పిడి చేసుకున్న అమ్మాయి (ట్రాన్స్‌ మ్యాన్‌) జంట పట్ల ఇలా అనుచిత ప్రశ్నలు వేసిన గీతపై విమర్శలు వస్తున్నాయి.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments