తిరుమ‌లేశుని ఆశీస్సులు పొందాం - రాజీనామాలు నా ద‌గ్గ‌ర‌కు రాలేదుః మంచు విష్ణు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:30 IST)
Manchu family Tirumala
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మంచు మోహ‌న్‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల సంద‌ర్శించారు. మోహ‌న్‌బాబు, మంచు విష్ణు, ల‌క్ష్మీప్ర‌స‌న్న‌తోపాటు పేన‌ల్ స‌భ్యులైన బాబూమోహ‌న్‌, మాదాల‌ర‌వి, శ్రీ‌నివాసులు త‌దిత‌రులు వున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు మాట్లాడుతూ, `మా` అధ్యక్షునిగా మా బిడ్డ ఎన్నిక‌కావ‌డం ఆ వేంక‌టేశ్వ‌రుని, షిరిడి సాయి ఆశీస్సులు ద‌క్కాయి. వారి ఆశీస్సుల‌తోపాటు `మా` స‌భ్యులంద‌రినీ ఆశీర్వాదం వుంది. ఇది ఎంతో బాధ్య‌త‌తో కూడిన ప‌ద‌వి. గౌర‌వ‌ప్ర‌ద‌మైంది. గౌర‌వానికి ఏ లోటురాకుండా నా బిడ్డ నెర‌వేరుస్తాడు. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
మంచు విష్ణు తెలుపుతూ, ఈ గెలుగు ప్ర‌తి ఒక్క స‌భ్యుడిది. ఎన్నిక‌ల త‌ర్వాత రావాల‌ని మొక్కుకున్నా. అందుకే తిరుమ‌ల వ‌చ్చా. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా మాకు బ‌లం కావాలి. అంద‌రి ఆశీస్సులు కావాల‌ని తెలిపారు. 
ఈ సంద‌ర్భంగా అక్క‌డి విలేక‌రులు పోటీ పేన‌ల్ రాజీనామా చేశారు క‌దా? అని అడిగితే, మీ మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ద‌గ్గ‌ర‌కు రాజీనామాలు రాలేదు. వ‌చ్చాక చెబుతాను. ఇది దేవుడి స‌న్నిది కాబ‌ట్టి. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు అంటూ ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments