లారెన్స్ మూవీ లక్ష్మీ బాంబ్‌కి కష్టాలు, ఇంతకీ ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:29 IST)
రాఘవ లారెన్స్ తెలుగు, తమిళ్‌లో సినిమాలు చేస్తూ... దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. తన సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. దీంతో లారెన్స్‌కి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చారు.
 
తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించిన కాంచన సినిమాని లారెన్స్ బాలీవుడ్లో లక్ష్మి బాంబ్ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ మూవీ ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న మరో డిఫరెంట్ మూవీ అంటూ అక్కడ మీడియాలో వార్తలు వచ్చాయి. రాఘవ లారెన్స్ హిందీలో తీసిన మొదటి సినిమా ఇది. డైరెక్ట్‌గా డిస్నీ హాట్ స్టార్లో రిలీజ్ అవుతోంది.
 
ఈ చిత్రం నవంబర్ 9న స్ట్రీమ్ అవుతుంది. అయితే... ఈ సినిమా టైటిల్ చేంజ్ అయింది. లక్ష్మి బాంబ్ అనే టైటిల్ నుంచి బాంబు ఎగిరిపోయింది. సినిమా టైటిల్ ఇప్పుడు… లక్ష్మి మాత్రమే. ఇంతకీ ఏమైందంటే... లక్ష్మి దేవత పేరు పెట్టి బాంబ్ అని అవమానిస్తారా..? అని వివాదం మొదలైంది. ఈ వివాదం అక్కడ ముదరడంతో టైటిల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించారు. 
 
ఇప్పటివరకు సౌత్‌కే పరిమితమైన లారెన్స్ ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మరి.. ఈ సినిమా లారెన్స్‌కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments