Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

దేవీ
శనివారం, 21 జూన్ 2025 (15:37 IST)
Lavanya Tripathi, Dev Mohan
నేటి కాలంలో కుటుంబ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డుతోంది. అందుకు కార‌ణం మ‌నుషుల మ‌ధ్య ఎమోష‌న్స్ లేక‌పోవ‌టమే.. భావోద్వేగాలే బంధాల‌ను క‌ల‌కాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని హృద్యంగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. 
 
ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో  లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు  భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దీన్ని రూపొందిస్తున్నారు. 
 
భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే స‌తీలీలావ‌తి చిత్రం. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.  ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 
 
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments