లావణ్యను లవ్ అని, అనుపమను ఉప్మా అని పిలుస్తా.. ఐ లవ్ ఉప్మా: రామ్

చాలా గ్యాప్ తర్వాత దేవదాసు హీరో రామ్ ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ఈ చిత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (11:10 IST)
చాలా గ్యాప్ తర్వాత దేవదాసు హీరో రామ్ ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన లావణ్య త్రిపాఠిని లవ్ అని పిలుస్తానని.. అనుపమ పరమేశ్వరన్‌ను ఉప్మా అని  పిలుస్తానని చెప్పుకొచ్చాడు. 
 
ఈ సినిమాలో కొత్తదనం వుంటుందని.. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరి ఫ్రెండ్‌షిప్‌కి వాళ్లే సరైన నిర్వచనం ఇచ్చుకోగలరని రామ్ తెలిపాడు. ఈ సినిమా చూశాక చాలామంది తమ స్నేహాన్ని పోల్చుకుంటారని వెల్లడించాడు.
 
సినిమా సెట్‌లో అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ లావణ్యను లవ్‌ అని పిలిచేవాళ్లం.. అలాగే అనుపమను ఉప్మా అని పిలిచేవాడిని. వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అని అడిగితే మాత్రం "ఐ లవ్ ఉప్మా" అని చెబుతానని చెప్పుకొచ్చాడు. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన సినిమా స్రవంతి రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments