Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన "సరాల్ : సీజ్‌ఫైర్"

Webdunia
సోమవారం, 17 జులై 2023 (20:32 IST)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సలార్ : సీజ్‌ఫైర్". త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, తాజాగా ఈ మూవీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. యూఎస్‌లో ఏకంగా 1979కిపైగా చిత్రాల్లో విడుదలకానుంది. 
 
అమెరికాలో ఇన్ని లొకేషన్లలో రిలీజ్‌కానున్న తొలి భారతీయ చిత్రంగా 'సలార్‌' నిలువనుంది. ఈ మేరకు విడుదలైన పోస్టర్‌ సైతం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 1979ని రెడ్‌ కలర్‌తో పెద్ద సైజులో డిజైన్‌ చేయడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. ఆ సంఖ్యను సంవత్సరంలా భావించిన పలువురు సినీ ప్రియులు కథలో అది కీలకంగా ఉండే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. 
 
'కేజీయఫ్‌'లో హీరో యశ్‌ బ్రాండ్ గురించి డైలాగ్‌ చెబుతూ.. 'సిన్స్‌ 1951' అని చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో, 'కేజీయఫ్‌', 'సలార్‌'కి ఏదో లింక్‌ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, 1979 ప్రభాస్‌ పుట్టిన సంవత్సరమంటూ కొందరు అభిమానులు సందడి చేస్తున్నారు. దీనికి సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. అమెరికాలో 27న ప్రీమియర్‌కానున్న ఈ సినిమా ఇండియాలో సెప్టెంబరు 28న పలు భాషల్లో విడుదలకానుంది. ఐమాక్స్‌ ఫార్మాట్‌లోనూ అందుబాటులో ఉండనుంది. 
 
ఇటీవల విడుదలైన టీజర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. హీరోని ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన 'సింపుల్‌ ఇంగ్లీష్‌' డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులతో అదరహో అనిపించాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments