Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీరంగంలోకి రాకముందే అతనితో లవ్‌లో ఉన్నా.. నటించడం చాలా కష్టం బాబోయ్: లాస్య

యాంకర్ నుంచి యాక్టర్లుగా మారడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే అనసూయ, రష్మీ వంటి అందాల భామలు బుల్లితెర నుంచి వెండితెరపై కనిపిస్తున్నారు. తాజాగా వీరి కోవలోనే యాంకర్ లాస్య చేరిపోయింది. రాజా మీరు కేక

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (15:06 IST)
యాంకర్ నుంచి యాక్టర్లుగా మారడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే అనసూయ, రష్మీ వంటి అందాల భామలు బుల్లితెర నుంచి వెండితెరపై కనిపిస్తున్నారు. తాజాగా వీరి కోవలోనే యాంకర్ లాస్య చేరిపోయింది. రాజా మీరు కేక సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తున్న లాస్య సినిమాల్లో నటించడం తెగ కష్టమంటోంది. రాజా మీరు కేక సినిమా జూన్ 9వ తేదీన విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో లాస్య మాట్లాడుతూ.. తనకు గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత గల పాత్రలంటేనే ఇష్టమని చెప్పింది. రాజా మీరు కేక చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉంది కాబట్టే అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. హేమంత్, నోయల్, రేవంత్, తాను నలుగురు స్నేహితులుగా కనిపిస్తామని.. తారకరత్న పవర్‌ఫుల్ విలన్‌గా కనబడతారని చెప్పింది. విలన్ వల్ల స్నేహితులకు ఎలాంటి కష్టం వచ్చింది.. సంపన్న కుటుంబంలో పుట్టి మధ్య తరగతి అమ్మాయిగా ఎలా మెప్పించాననే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటోంది. 
 
రియల్ లైఫ్‌లో తనకు స్నేహితులు ఎవ్వరూ లేరని.. ఈ సినిమా ద్వారా తనకు ముగ్గురు స్నేహితులు దొరికారని లాస్య చెప్పుకొచ్చింది. దర్శకుడు కృష్ణ కిషోర్ తనలో నమ్మకాన్ని పెంచి ఈ పాత్రకు ఒప్పించారన్నారు. యాంకరింగ్‌ కంటే నటన చాలా కష్టమని తెలిసింది. అన్నీ కోణాల్లో నటించడం అనేది అంత సులభం కాదు. ప్రస్తుతం పెళ్ళి కారణంగా టీవీ షోస్‌కు బ్రేక్‌ తీసుకున్నానని లాస్య వెల్లడించింది. 
 
సోలో, డిఫరెంట్‌ కాంబినేషన్‌లో షోస్‌ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మంజునాథ్‌తో ఏడేళ్ల ప్రేమాయణం పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కిందని లాస్య తెలిపింది. మంజునాథ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇద్దరం ఓకే కంపెనీలో కొన్ని రోజుల పాటు కలిసి పనిచేశాం. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. టీవీ రంగంలోకి వచ్చే ముందు మంజునాథ్‌ లవ్‌ ప్రపోజల్‌ను ఒప్పుకునే వచ్చాను. ప్రతి చిన్న విషయాన్ని తనకు చెప్తుంటాను.. త్వరలో మరో సినిమాలోనూ నటించబోతున్నానని లాస్య తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments