Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారదుడే వర్మగా పుట్టివుండొచ్చు.. బాలయ్య ఐడియా భేష్: లక్ష్మీ పార్వతి

''లక్ష్మీస్ ఎన్టీఆర్" అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన సినిమాపై దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. వర్మ పేరు చెప్పగానే లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. రామ

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (11:24 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్" అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన సినిమాపై దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. వర్మ పేరు చెప్పగానే లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ పేరు చెబితినే వివాదాలని.. నారదుడే ఈ జన్మలో వర్మ రూపంలో జన్మించివుండొచ్చునని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. 
 
వివాదాలకు పుట్టిల్లైన వ్యక్తి సినిమాతీస్తే, వివాదాలు రాకుండా మరేం ఉంటాయని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. దెయ్యాల సినిమాలు తీసి జనాలను భయపెట్టిన ఆయన, సామాజానికి సందేశం ఇచ్చే ఒక్క సినిమా కూడా తీయలేదన్నారు.
 
డ్రగ్స్ కేసులో విచారణకు చార్మీని పిలిపిస్తే, ఆమె ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన దారి తప్పిన మేధావని తనకు అర్ధమైందని, ఆయన తన తెలివిని మంచికి వినియోగిస్తే బాగుండేదని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. నారదుడి కలహం లోకకల్యాణం కోసం జరుగుతుందని.. అలాంటి వ్యక్తితో వర్మను పోల్చడం సరికాదన్నారు. వర్మ కలహం లోకనాశనం కొరకే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
 
ఇక ఎన్టీఆర్‌పై బయోపిక్ విషయంలో నందమూరి హీరో బాలయ్య ప్రయత్నాన్ని లక్ష్మీపార్వతి అభినందించారు. తన భర్త జీవితంలోని విజయ గాధలను మాత్రమే చూపిస్తానని బాలయ్య చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని సినిమాగా చూపించాలని తాను కోరట్లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments