Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ పాటలకు నెట్లో శ్రోతల బ్రహ్మరథం: చిరు కుమ్మేశాడు.. ఇక రాయ్ లక్ష్మీతో రత్తాలు.. రత్తాలు.. అంటున్నాడు..

దాదాపు 8 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాట రికార్డులను బ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:40 IST)
దాదాపు 8 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాట రికార్డులను బద్ధలు కొట్టింది. ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్‌లోనే ఖైదీ భారీ స్థాయిలో హైప్స్ సాధించింది. 

శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని ఇచ్చిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్.. ఖైదీకి కూడా సంగీతం సమకూర్చడం సినిమా ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో 70లక్షల గ్రాస్‌ను బాస్ పాట కైవసం చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే? 70 లక్షల మంది ''ఖైదీనంబర్ 150''లోని 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' ఆడియో సాంగ్‌ని విన్నారు. అంటే బాస్ క్రేజు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
లహరి మ్యూజిక్ ద్వారా మెగాస్టార్‌ చిరంజీవి ప్రెస్టీజియస్‌ మూవీ ఖైదీ నెం.150 ఆడియో విడుదలైంది. ఈ ఆడియోకి శ్రోతల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్‌ అధినేత మనోహర్‌నాయుడు స్పందిస్తూ- చిరంజీవిగారి మాస్టర్‌, హిట్లర్‌, మెకానిక్‌ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపద్బాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్‌ లీడర్‌, ముగ్గురు మొనగాళ్ళు వంటి బ్లాక్‌బస్టర్‌ ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్‌ చేశాం. 

ఈ చిత్రాలు మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు చిరంజీవిగారి కెరీర్‌లోనే ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్‌ చెయ్యడం మాకెంతో గర్వంగా వుంది.. అంటూ చెప్పుకొచ్చారు.  
 
ఇప్పటికే విడుదలైన ఖైదీ పాటల్లో 'అమ్మడు.. కుమ్ముడు..' పాటకు 7 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ కాగా, 'సుందరీ..' పాట 4 మిలియన్‌ వ్యూస్‌కి చేరుకుంటుండగా, 'యు అండ్‌ మి' పాట 1 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసింది. ఈ చిత్రంలోని 'రత్తాలు..రత్తాలు..' అనే ఐటమ్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 31న విడుదల చేస్తున్నాం. 

అదే రోజు ఈ చిత్రంలోని అన్ని పాటలు యూ ట్యూబ్‌ జూక్‌బాక్స్‌లో అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా యూనిట్ మొత్తానికి మనోహర్ నాయుడు కృతజ్ఞతలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments