Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీరిలీజ్‌లోను సరికొత్త రికార్డులు నెలకొల్పిన పవన్ "ఖుషి"

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (15:17 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన చిత్రం "ఖుషి". ఎస్.జె.సూర్య దర్శకుడు. ఈ సినిమా 22  యేళ్ళ క్రితం విడుదలైంది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. కొత్త సంపత్సరాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. అయినప్పటికీ ఈ చిత్రానికి క్రేజ్ తగ్గలేదు. 
 
ఈ మూవీని చూసేందుకు అభిమానులు కొత్త సినిమాకు వచ్చినట్టుగా వచ్చారు. దీంతో రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. విడుదల చేసిన చేసిన ప్రతిచోటా సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దీంతో తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 4.15 కోట్లను వసూలు చేసింది. 
 
వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.62 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. తద్వారా రీ రిలీజ్ అయిన తొలి రోజునే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా "ఖుషి" నిలిచిపోయింది. ఇప్పటివరకు పవన్ నటించిన "జల్సా" చిత్రం రీ రిలీజ్ రికార్డే మొదటి స్థానంలో ఉండగా, ఇపుడు ఈ రికార్డును 'ఖుషి' బ్రేక్ చేసింది. మూడో స్థానంలో మహేష్ బాబు నటించిన 'పోకిరి' చిత్రం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments