సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు షాక్.. ఫోటోలు పెట్టేది వాళ్లే.. మరి పరువు..?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:57 IST)
యూట్యూబ్ ఛానల్ ఛానళ్ల పై టాలీవుడ్ హీరోయిన్ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్ పల్లి కోర్టు. ఇవాల్టి కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని కూకట్‌పల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇక అంతగా.. సమంత తరపు న్యాయవాది వాదన విన్న కోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
తప్పు జరిగిందని భావిస్తే….పరువునష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కోరొచ్చు కదా ఆని ప్రశ్నించింది కోర్టు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని తెలిపింది. కోర్టు ముందు సెలబ్రిటీలు, మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.
 
సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు. ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పేర్కొన్నారు. సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు సమంత తరఫు న్యాయవాది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments