Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

దేవీ
గురువారం, 8 మే 2025 (12:36 IST)
Rashmika Mandanna
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు. ధనుష్ రష్మిక మందన చిరునవ్వులతో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.
 
ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ పోయిరా మామ చార్ట్ బస్టర్ హిట్ అయింది. మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.‘పోయిరా మామా’ సాంగ్ తో కుబేర మీద ఉన్న హైప్  నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.
 
 క్యారెక్టర్ బేస్డ్ నరేటివ్స్ తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
 
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
 
కుబేర జూన్ 20, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments