Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి2' పరమ చెత్త... ప్రభాస్ ఒంటెలా వున్నాడు... రాజమౌళి దర్శకత్వం ఘోరం...

బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఊరంతా ఒకదారయితే ఉలిపిరికట్టది మరో దారనే టైపు వున్నారు. అఫ్‌కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటివారికి కొదవే లేదనుకోండి. ఇంతకీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊరంతా ఒకదారిని వెళితే ఉలిపిరి

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (13:57 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఊరంతా ఒకదారయితే ఉలిపిరికట్టది మరో దారనే టైపు వున్నారు. అఫ్‌కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటివారికి కొదవే లేదనుకోండి. ఇంతకీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊరంతా ఒకదారిని వెళితే ఉలిపిరికట్టలా మరోదారి వెళ్లేవాడు ఎవరయ్యా అంటే కమల్ ఆర్ ఖాన్. ఇతడు ఏదయినా చిత్రం విడుదలయ్యిందంటే ఇక దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. తాజాగా విడుదలైన రాజమౌళి చిత్రం బాహుబలి2పై తీవ్ర విమర్శలు చేశాడు. 
 
హీరో ప్రభాస్ ఈ చిత్రంలో ఓ ఒంటెలా కనిపిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలాంటి ఒంటెలా వుండే హీరోను ఎవరయినా బాలీవుడ్ నిర్మాతలు తీసుకుని చిత్రాన్ని తీస్తే వాళ్లంతా ఇడియట్స్ కింద మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. అసలు బాహుబలి2లో కథేమీ లేదనీ, గ్రాఫిక్స్ కూడా పరమ చెత్తగా చూపించారని విమర్శించాడు. 
 
రాజమౌళి ఇంత ఘోరంగా దర్శకత్వం చేస్తాడని తను అనుకోలేదని, ఇక సంగీతం కూడా పరమ వరెస్టుగా వుందంటూ వ్యాఖ్యానించాడు. బాహుబలి2 కంటే బాహుబలి బిగినింగ్ ఎంతో నయం అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డబ్బులు పోసి చూడటం వల్ల డిస్టర్బ్ అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి తన రేటింగ్ 5కి 1 అని కూడా పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

Mid Day Meals: సూపర్ వెరైటీ రైస్‌తో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులు హ్యాపీ.. కానీ వారికి మాత్రం కష్టాలు..?

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments