శర్వానంద్ కు జోడిగా కృతి శెట్టి

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:00 IST)
Kriti Shetty
టాలీవుడ్  అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు,  శమంతకమణి, దేవ్ దాస్,  హీరో  వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం *ఉప్పెన* తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. 
 
ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్  పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.
 
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments