Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత్ర కోసం హీరోయిన్ పాట్లు... 15 కేజీల బరువు పెరిగిన కృతి సనన్

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (15:20 IST)
చాలా హీరోహీరోయిన్లు పాత్ర కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నటిస్తుంటారు. అంటే, కథ డిమాండ్ మేరకు, పాత్ర కోసం తమ శరీర సౌష్టవాన్ని పూర్తి మార్చుకుంటారు. ముఖ్యంగా, బరువు పెరగడ, తగ్గడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఫీట్లనే ఇపుడు హీరోయిన్ కృతి సనన్ కూడా చేసింది. ఈమె పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. 
 
కృతి సనన్ తాజాగా మిమి అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందురో సరోగేట్ మదర్ పాత్రలో కనపించనుంది. అయితే ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా కనిపించడం కోసం కృతిసనన్‌ 15 కిలోల బరువు పెరిగింది. సినిమాలో వచ్చే ఓ పాట కోసం కృతిసనన్‌ బొద్దుగా, లావుగా కనిపించే పాత్రకు సంబంధించిన సీన్లను షూట్‌ చేశారట. 
 
దీనికి సంబంధించిన షూట్‌ పూర్తికావడంతో మళ్లీ కృతిసనన్‌ పెరిగిన బరువును తగ్గించే పనిలో పడినట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్‌. నేను మళ్లీ యధావిధిగా మంచి శరీరాకృతిని పొందడానికి కష్టపడుతున్నాను. ఇప్పటివరకు నేను పొందిన అధిక కాలరీలను తగ్గించడం శ్రమతో కూడుకున్న పని. నాలో శక్తి తగ్గుతున్నా గత కొన్ని రోజుల నుంచి సీరియస్‌గా వర్కౌట్స్‌ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. 
 
2011లో విడుదలై జాతీయ అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం ‘మలా ఆయ్‌ వాయ్‌ చి’ కి రీమేక్‌గా మిమి తెరకెక్కుతోంది. 2020 జులైలో  ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

Cardiac Arrest: గుండెపోటు స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఏపీఎస్సార్టీసీ డ్రైవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం