మహేష్ బాబు హీరోయిన్‌ను కాటేసిన కరోనా : దేశంలో తగ్గిన పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (10:37 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "1 నేనొక్కడినే". ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భామ కృతి సనన్. ఈ చిత్రం అట్టర్ ప్లాఫ్ కావడంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో ఈమె బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే, ఇపుడు ఈ భామ కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఇటీవ‌ల 'జుగ్ జుగ్‌ జియో' చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వ‌రుణ్ ధావ‌న్, నీతూ క‌పూర్, రాజ్ మెహ‌తాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ కాగా, తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌నన్‌కు కూడా క‌రోనా సోకింది. 
 
కొద్ది రోజుల క్రిత‌మే ఈ అమ్మ‌డు 'రాజ్‌కుమార్ రావు' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘ‌ర్ నుండి ముంబై వ‌చ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. కృతి స‌న‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 
 
భారీగా తగ్గిన కరోనా కేసులు 
ఇదిలావుంటే, గడిచిన 24గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గిపోయాయి. జూలై 10 తర్వాత రోజువారీ కేసుల సంఖ్య అతితక్కువ. దేశంలో కొత్తగా 26,567 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,03,770కి చేరింది. 
 
మరో 385 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,40,958కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,83,866 క్రియాశీల కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. గడిచిన 24గంటల్లో 39,045 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 91,78,946 మంది డిశ్చార్జి అయినట్లు వివరించింది. 
 
ఇదిలావుంటే, సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 10,26,399 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు 14,88,14,055 నమూనాలను టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments